Current Affairs
Stay updated with daily current affairs for your exam preparation.
హిందుస్తాన్ లో హిందువులు మైనారిటీలా | Religious Minority | Upttake Jobs
కనిపించే సింహాలు మూడా/నాలుగా
Economic Survey Highlights: భారత ఆర్థిక సర్వే : 2021–22
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ)లోని ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సాధారణంగా ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్– సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950–51లో ఆవిష్కరించారు.
Economic Survey Highlights: కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్.. తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరం 9.2 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం 8–8.5 శాతం స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జనవరి 31న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలోని వివరాలు ఇలా..
ఇన్‌ఫ్రాపై 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాలి..
2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో .. ఈ వ్యవధిలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2008–17 మధ్య కాలంలో ఇన్‌ఫ్రాపై భారత్ 1.1 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించింది. భారీ లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రం నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ)ని ఆవిష్కరించింది. 2020–25 మధ్య కాలంలో ఇన్‌ఫ్రాపై 1.5 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించే అంచనాలతో ఇది రూపొందింది. దేశీయంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఇది తోడ్పడనుంది.
ఎయిరిండియా విక్రయంతో ప్రైవేటీకరణకు ఊతం..
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ వ్యవహారం .. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ఎయిరిండియాను టాటా గ్రూప్ దాదాపు రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఇదే.. ఈ మార్గంలో ఏకంగా..?
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్-సైబీరియన్. ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9259 కిలో మీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్ జపాన్ గుండా వ్లాదివోస్టోక్ వరకు విస్తరించింది.
ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండటం విశేషం. 5700 మైళ్ళ వద్ద, రైలు మాస్కోను వదిలి, ఐరోపా రష్యాలో ఉన్నది, ఆసియాలోకి ప్రవేశిస్తుంది మరియు వ్లాడివోస్టోక్ యొక్క పసిఫిక్ మహాసముద్రం ఓడరేవుకు చేరుకుంటుంది. ఈ ప్రయాణం తూర్పు నుంమ్ర్ పడమటి నుండి పూర్తవుతుంది.
ఈ రైల్వే సైబీరియా అభివృద్ధిని మరింత పెంచింది, అయితే విస్తారమైన విస్తీర్ణం ఇప్పటికీ తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ట్రాన్స్-సైబీరియన్ రైల్వేలో రష్యా ద్వారా ప్రయాణించారు. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే, ధాన్యం, బొగ్గు, చమురు, చెక్క వంటి సహజ వనరులను రష్యా, తూర్పు ఆసియా నుంచి యూరోపియన్ దేశాలకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావవంతంగా ప్రభావితం చేస్తుంది.
Natural Disasters: ప్రకృతి వైపరిత్యాలపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ - పనితీరు
భారత్‌లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకొని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తదితరాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 హైడ్రో మెట్రాలజికల్ స్టేషన్లు సీడబ్ల్యూసీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్‌తో సీడబ్ల్యూసీ ఒప్పందం కుదుర్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఐఎండీ 33 రాడార్ నెట్‌వర్క్ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. వరద పరిస్థితుల అంచనాకు 14 ప్రాంతాల్లో ఫ్లడ్ మెట్రాలజికల్ ఆఫీసులు (ఎఫ్‌ఎంఒ)న్నాయి. కచి్చతత్వాన్ని మరింత పెంచేలా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముంది. 2016లో వార్దా తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ముంచేస్తుందని భారత వాతావరణ శాఖ చెబితే, యూరోపియన్ మోడల్ మాత్రం చెన్నై వైపు వెళ్తుందని కచి్చతంగా అంచనా వేసింది. గత మే నెలలో అసాని తుపాను ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్తోందని ఐఎండీ చెప్పగా యూరోపియన్ మోడల్ మాత్రం ఏపీ వైపు మళ్లుతుందని కచి్చతంగా అంచనా వేసింది.
ముంచేస్తున్న ఆకస్మిక వరదలు
క్లౌడ్ బరస్ట్‌లతో ఏర్పడే ఆకస్మిక వరదలు కొద్ది కాలంగా విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. భారత వాతావరణ శాఖ, అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్ ఫ్లడ్ గైడన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఎఫ్‌జీఎస్) ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్‌లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వగలదు. కానీ ప్రతిస్పందనకు తక్కువ సమయం ఉండడం సహాయ చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్ బరస్ట్‌లను కనీసం రెండు మూడు రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరముందని బోంబే ఐఐటీలో వాతావరణ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ శ్రీధర్ బాలసుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
గత పదేళ్లలో దేశంలో వరదలు, తుఫాన్ల తీరుతెన్నులు...
ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రకృతి వైపరీత్యాల్లో రెండింటిని మన దేశం ఎదుర్కొంది. టాక్టే, యాస్ తుపానులతో దేశం చిగురుటాకులా వణికింది. ఒక్కో తుపాను కనీసం రూ.7,600 కోట్ల నష్టం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో, నిర్వాసితులు లక్షల్లో ఉన్నారు. దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953–2010 మధ్య 4.9 హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమికి మాత్రమే సురక్షిత ప్రాంతంలో ఉంది. ఏటా సగటున 1,685 మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ప్రభావితమవుతున్నాయి.
UAV సాంకేతికతకు టీ వర్క్స్ పట్టం| T Works degree in UAV technology
గాలిలో ఎగిరే మానవరహిత విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తదితరాల (యూఏవీ) సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంప్రదాయ యూఏవీ సాంకేతికత హద్దులను చెరిపివేస్తూ తక్కువ వ్యయమయ్యే సాంకేతికతపై ఇక్కడ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరగనున్నాయి. ఇక్కడ అభివృద్ధి చేసే డిజైన్లు, సాంకేతికతను ఇతరులతో పంచుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో త్వరిత గతిన యూఏవీలను నిర్మించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. రాయదుర్గంలో రెండేళ్ల క్రితం ‘టీ వర్క్స్’ భవనానికి శంకుస్థాపన జరగ్గా సుమారు రూ.100 కోట్ల వ్యయంతో 78వేల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన టీహబ్ రెండో దశ భవనం ఆవరణలోనే టీ వర్క్స్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటుండం విశేషం. టీ హబ్ కొత్త ఆవిష్కరణలకు పురుడు పోయనుండగా, టీ వర్క్స్ కొత్త డిజైన్లు, సాంకేతికతకు బాటలు వేస్తుందని అధికారులు చెప్తున్నారు.
ప్రొటోటైప్ సెంటర్‌లో అత్యాధునిక వసతులు
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్‌గా పేర్కొంటున్న టీ వర్క్స్‌లో అత్యాధునిక పరికరాలు, వసతులు అందుబాటులోకి రానున్నాయి. యంత్ర తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వర్క్ స్టేషన్లు, ఫినిష్ షాప్‌లు, లేజర్ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్, మెటల్ షాప్, వెల్డ్ షాప్, వుడ్ వర్కింగ్ వంటి అనేక వసతులు, వాటికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉంటాయి. వివిధ రంగాల్లో కొత్త ప్రయోగాలు చేసే తయారీదారులు, ఆవిష్కర్తలతోపాటు ఇంజనీర్లు, డిజైనర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, వలంటీర్లు, సంబంధిత రంగాలకు చెందిన వారు ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం వహిస్తారు. ప్రోటోటైప్ (నమూనాల) నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. టీ వర్క్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు.
హోనోలులు రాణిని తిందాం
PSLV-C 53: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ 53..
ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.
World Airport Awards: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డు
స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2022లో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డును దక్కించుకుంది. అంతేకాదు ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కూడా స్థానం మెరుగైంది. టాప్ 100 ఎయిర్‌పోర్ట్ లీగ్ జాబితాలో 2021లో 64వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానంపైకి ఎగబాకి 63వ స్థానం దక్కించుకుంది.
Upttake